పడమటి గోదావరి రాగం

నీ స్నేహం….
ట్రైన్ కూత వేస్తూ చిన్న కుదుపుతో బయలుదేరింది బండి. లగేజంతా సర్దిపెట్టుకుని, చిన్నబ్యాగ్  పక్కన పెట్టుకుని చెవిలో హెడ్ ఫొన్స్ పెట్టుకుని పాటలు వినడంమొదలుపెట్టాడు. అతని పేరు శశి సిటీలో ఉద్యోగం. సెలవు దొరకడంతో సొంత వూరుకి బయలుదేరాడు. మంచి ఎమోషనల్ సాంగ్స్ వినడం అతనికి ఇష్టం. అవే పిచ్చిగా వింటుంటాడు. ఒకే పాట పది సార్లు విని వినీ బోర్ కొట్టింది. బ్యాగ్ లో నుండి వాటర్ బాటిల్ తీసి రెండు గుటకలువేసాడు. పక్కనే ఉన్నపుస్తకం చూసి, హెడ్ ఫోన్స్ తీసేసి చదవడం మొదలుపెట్టాడు. కాళీ ఉన్నప్పుడల్లా తన జీవితంలో మరవలేని విషయాలు పుస్తకం లో వ్రాసుకోవడం అతనికి అలవాటు. అప్పుడప్పుడూ అవి చదివ పాత జ్ఞాపకాలతో ఆనందిస్తుంటాడు.

నేను మరువలేని నా స్నేహితుడు విజయ్.. వాడిని ముద్దుగా విజ్జిగాడు అని పిలుస్తా. వాడు మావయ్యకొడుకే.. నాకన్నా నెలలుచిన్న, కాబట్టి మాకిద్దరికీ బాగా కుదురుతుంది ఆటాపాటా. ఐదో తరగతిలోకి రాగానే చదువుకి టాటా చెప్పాడు. మొండివాడిలా బడిమానేసి పొలంపనుల్లో పడ్డాడు. వాడిని చూసి నాకు స్కూలుకి వెళ్ళాలని వుండేది కాదు. కొన్నిరోజులు ఏదో వంక పెట్టి మానేసేవాడిని కానీ ఇంట్లో అమ్నానాన్నా భయంతో స్కూలుకెళ్ళక తప్పేది కాదు. ఎప్పుడు ఇంటికి వచ్చిపడిపోదామా విజ్జిగాడితో కలిసి ఆటలాడుకుందామా అని ఉండేది. స్కూలు నుండి ఇంటి సందులోకిరాగానే పరుగెత్తుకుంటూ పుస్తకాలు విసిరేసి, “విజ్జిగా..”, అంటూ వెళ్ళిపోయేవాడిని ఆటలకు.  రొండు మూడు గంటలు ఆడి ఇంటికి చేరుకునేవాడిని.

రాత్రి తొమ్మిదింటివరకూ సాగేవి మా ఆటలు. మా వూరి రామాలయం వెనుక కొంత ఖాళీ స్ధలంలో కంద మొక్కలు ఉండేవి. అందరం పంటలు వేసుకుని ఓడినవాడు దొంగ, మిగతావాళ్ళు ఆ కంద చెట్లకింద చీకటిలో దాక్కునేవాళ్ళం. కటిక చీకటి భయం అసలుండేది కాదు దొంగపట్టినవాడికి ఎవరూ దొరకక కన్నీళ్ళొచ్చేవి. ఈ రోజు ఎవరూ దొరకకపోతే తరువాత రోజుకూడా అదే ఆట కొనసాగేది.

పంటలు వేయడంలో విజ్జిగాడు కొన్ని మ్యాజిక్కులు చేసేవాడు. ఎలా పంటలు వేయాలో నాకు చెప్పేవాడు. నేను ఎప్పుడూ దొంగ అవకుండా దాటేసేవాడిని.. ఎవడోవొకడిని భలి చేసేసి ఏడిపించేవాళ్ళం.

ఒక్కొక్కసారి మా మ్యాజిక్కు పనిచేయక విజ్జిగాడు  దొంగయ్యేవాడు.. అందరూ దాక్కొనేముందు.. “ఒక ఐదునిముషాలు దాక్కొని వచ్చేసెయ్ ఇంటకి పోదాం”, అని చెవిలో చెప్పేవాడు.. చక్కగా ఇంటికి పోయేవాళ్ళం ఎవరికీ తెలియకుండా.. పాపం మిగిలినవాళ్ళంతా కంద మొక్కలమధ్య పాకుతుండేవారు.

ఇంటికిరాగానే ఎక్కడ గోక్కుంటే అమ్మ తిడుతుందో అని ఇబ్బంది పడతూ చాటుగా గోక్కునేవాడిని.. అది గమనించండంతో మొదలయ్యేవి అమ్మ అక్షింతలు.. “మళ్ళీ ఆ ..డొంకల్లో తిరిగొచ్చావా..?, ఉండు నాన్నతో చెప్పి చెబుతా నీ పని”, అని.

నాన్న వచ్చేసరికి ముసుగు తన్నేసేవాడిని, మళ్ళీ నాన్న లెచేసరికి స్కూలుకెళిపోయేవాడిని. ఎప్పుడైనా ఆదివారాల్లో పడేవి తిట్లన్నీ.. అదీ మన టైము బాగోక నాన్నముందు మా ఆటల విషయాలు మా ఇంటకొచ్చిన మావయ్యల పిచ్చాపాటీ మాటల్లోకొచ్చినప్పుడు.

ఇక వేసవి సెలవుల్లో మాకు పొద్దేతెలిసేది కాదు, ఎండాకొండా తెలియకుండా పొలాల్లో తిరిగేవాళ్ళం. ఎండిపోయిన ఏటిగట్టు ఇసుకల్లో మనుషులు దూరేటంత సొరంగాలు తీసేవాళ్ళం. ఆ గట్టు చాలా ఎత్తుగా ఉండేది. ఒకడు చేయి అందిస్తే కానీ ఎక్కలేం. మా విజ్జిగాడు చుట్టూ తిగిగి ఎక్కి నాకోసం వచ్చి చేయ్యిచ్చేవాడు. ఏరు పొంగితే చాలా వేగంగా నీళ్ళు వస్తాయంట. ఒక్కనిముషంలో ముంచేస్తుంది చిన్నపిల్లలు వెళ్ళకూడదని పెద్దోళ్ళు చెబుతండేవారు.. అది వింటుంటే మాకు భయంవేసేది. “ఒరే.. ఇప్పుడునీళ్ళొచ్చేస్తే..మనం ఏదోలా ఎక్కేస్తాం వీడు ఎక్కలేడు ఎలా రా”, అని నన్ను ఏడిపించేవారు విజ్జిగాడు లేని సమయంచూసి మిగతా స్నేహితుల, నాకు భయంతో చెమటలు పట్టేవి. విజ్జిగాడు రావడం చూసి పారిపోయేవాళ్ళు.. లేకపోతే వీవు గుద్దుల తప్పవు వాళ్ళకి, వాడంటే అంత భయం అందరికీ, ఎవరినీ నన్ను ఏమనననిచ్చేవాడు కాదు.

కాస్త సూరీడు నడినెత్తికెక్కేసరికి నిద్రగన్నేరు చెట్టుకింద కూల్ డ్రింక్ మూతలు, సిగరెట్ పెట్టె కాగితాలతో రకరకాల ఆటలు ఆడేవాళ్ళం.

ఆ కాగితాలకి, మూతలకి కంపెనీని బట్టి విలువ ఉండేవి… ఒక గిరి గీసి అందులో పెట్టేవాళ్ళం కాగితాలన్నీ. పలుచని నాపరాయిముక్కతో ఒక పదడుగుల దూరంనుండి కొట్టాలి ఆ కాగితాలని.. గిరిదాటి బయటకొచ్చినవి మనం గెలుచుకున్నట్లు, మళ్ళీఒకసారి కొట్టుకునే చాన్సు వస్తుంది కూడా.., కొట్టే పని నాది.., వచ్చినవి ఏరడం..,పందెం కాయడం… సగం వచ్చినవాటికోసం చెలిగి, దెబ్బలాడి.. సొంతంచేసుకునే పనులన్నీ విజ్జిగాడివి. మా పందాలు లక్షల్లోకూడా ఉండేవి.. , బస్తాలు బస్తాలు పోగుచేసేవాళ్ళం.. అన్నీ మూట కట్టి గెదెల పాక అటకపైకి ఎవరికీ తెలియకుండా రాత్రిసమయంలో దాచేవాళ్ళం.. అరువైనా పెట్టేవాళ్ళం కానీ పాత మూట విప్పడం మాకు ప్రెస్టేజ్ ఫీలింగులాంటిది.

సాయంత్రం అవుతుంటే చెరువులో ఈతకి వెళ్ళేవాళ్ళం. నాకు పెద్దగా ఈతరాదు.. విజ్జిగాడు సాయంతో కాస్త నేర్చుకున్నా., నీళ్ళల్లో కూడా రకరకాల ఆటలు ఆడేవాళ్ళం. చిన్న ఆకు ముక్కని నీటిలోవేసి వెతకాలి. దొరికినవాడు త్వరగా గట్టెక్కేయాలి. లేకపోతే పక్కనున్నవాడు తన్నుతాడు. ఎంత సరదాగా ఉన్నా తన్నులకి కాళ్ళునెప్పిపుట్టేవి తరువాత రోజు. జామకాయలు, మామిడికాయలు పక్కూరి వాళ్ళ తోటల్లో చెట్ల కొమ్మల్లో కూర్చుని తినేవాళ్ళం. మాలో ఎవడొకడు తెలివిగా ముందే ఉప్పుకారం కలిపిన పొట్లం పట్టుకొచ్చేవాడు నంజుకుతినడానికి. ఇక తేగలు బుర్రగుంజు చెప్పనక్కర్లేదు, సీజన్ బట్టి మా తిండి ఉండేది. ముంజికాయల సీజన్లో గెలలు గెలలు తినేవాళ్ళం. విజ్జిగాడు చెట్టు ఎక్కడంలో మంచి నేర్పరి. చింతకాయలు సీజన్లో చెట్లకింద ఉయ్యాలలూగుతూ తినడం. ఈతకాయలైతే పాకలోని ఇనుపడబ్బాలో ముగ్గబెట్టి రోజూ ముగ్గిన పళ్ళు నాకంటే నాకు అని దెబ్బలాడి మరీ తినేవాళ్ళం.

పొలాల్లో గట్లు దాటడం, చెరుకుతోటల్లో కబుర్లు, చెరువుల్లో ఈతలు చేసిన అల్లర్లు బలేగుండేవి.

ఇక షష్టి, శివరాత్రి ఉత్సవాలు మరువలేనివి మాకు. ప్రక్కవూరి పొలాలగట్లంటా రొండు కిలోమీటర్లు నడిచి గుడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ తీర్ధంలోని దుకాణాలలో జీడ్లు, ఖర్జూరం కొనుక్కుని, కావలసినవి తినడం ఒక సరదాయైతే ఆడుకోవడానికి మార్కెట్టులోకి వచ్చిన ఆకర్షించే ఆటవస్తువులు కొనడం ఇంకొక సరదా. ఒకసారైతే నేను వాటర్ గేమ్.. విజ్జిగాడు మెషిన్ గన్ కొనుక్కుని ఇంటిదారి పట్టాం. స్నేహితుడొకడు నేనేంకొన్నానో చూడండ్రోయ్ అంటూ జేబులోంచి పాలక్యాన్ల లారీ బొమ్మ తీసాడు.., “ఏరా!.. ఇక రేపట్నుండి మీ నాన్న సైకిలు మానేసి ఈ లారీపై వెళతాడా”, అని అందరం విరగబడి నవ్వుకున్నాం.., వాళ్ళనాన్న పాలవ్యాపారి మరి.

ఆ నవ్వులాటలో నా వాటర్ గేమ్ కాస్తా.. పక్కనున్న పంట బోదిలో పడిపోయింది.. “అయ్యో “,అన్నానో లేదో.. విజ్జిగాడు దూకి ఈతకొట్టి పట్టేసాడు..

మళ్ళీ అదేరోజు సాయంత్రం వెళ్ళేవాళ్ళం. చక్రంఆట, గుండాట, తెరసినిమాకోసం. చక్రంఆట దగ్గర పిల్లలు ఈగల్లా మూగేవారు. మేం గుండాటలో కాసేవాళ్ళం. ఏ అంకె వస్తే అన్ని రెట్లు ఇచ్చేవారు. సినిమా హీరోల బొమ్మలతో ఒక ఆట ఉండేది. వస్తే ఏబయ్ అరవై వచ్చేవి.. పోతే ఒక్కసారే పోయేవి డబ్బులంతా. ఒక్కోసారి పోలిసులొస్తున్నార్రోయ్ అనగానే బల్లమీద డబ్బులు లాక్కొని కొందరు, చెరువుల్లోకి దూకి కొందరు, కోళ్ళఫారాల్లోకి కొందరు, ఆకుమడులు తొక్కుకుంటూ కొందరు పారిపోయేవారు.

రాత్రి తెరసినిమా చూసి అదే పంట గట్టుపై , వెన్నెల కాంతిలో ఒకడి చొక్కాకొస ఒకడు పట్టుకుని లైనుగా నడుస్తూవచ్చేవాళ్ళం. “ఒరే!.. శ్రీదేవి , జయప్రద మీద ఏబయ్ సంపాదించా.. చా!.. ఆ ఏన్టీవోడు మొత్తం పట్టుకుపోయాడ్రా.., లేకపోతేనా ఈ వారం అంతా గొల్లతాత కొట్టులో జీడ్లు పార్టీ నెనే చేసేవాడిని..”, అన్న మాలో ఒకడి మాటలకి నవ్వుకున్నాం. ఇంతలో వెనకాలున్న వాడు , “ఒరే!!.. చెరుకుతోటలో ఏదో చప్పుడైంది.. బాబోయ్ కొరివి దెయ్యమేమో”, అనగానే..  ఎవడికి తోచిన దారిలో వాళ్ళు పరుగులంకించాం.

ఇక మా ఊర్లో వేసే తెరసినిమాకైతే మా హడావుడి చూడాలి. అప్పుడు మా ఫేవరెట్ హీరో కృష్ణ, మిగతావాళ్ళూ, ఎన్టిఆర్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ అలా ఉండేవి. ఎవడి హీరో సినిమా ఐతే వాళ్ళ పక్కవూరెళ్ళి బుడగలు తెచ్చేవాళ్ళం. బుడగల్లో పువ్వులు నింపి…  హీరో కనబడినంతసేపూ… తెరమీదకు ఎగరేసేవాళ్ళం ,తెరమీద నీడ పడి సినిమా కనబడడంలేదని పెద్దవాళ్ళు తిట్టినా లెక్కచేసేవాళ్ళంకాదు. ఈ లోపు మా హీరో అంటే పడనివాళ్ళ రబ్బరుబ్యాండుకు కాగితంముక్కలు సంధించి బుడగలు పేల్చేసేవాళ్ళు. “ఎవడ్రా పేల్చింది …”,అని పెద్దగొడవ.., కొట్లాటలతో చెరుకుతోటల్లోకో, బడివెనక్కో పెద్దొళ్ళకి కనబడకుండా వెళ్ళి కొట్టుకునేవాళ్ళం.

రోడ్డుపై తెరకట్టివేసేవారేమో సినిమా.. రోడ్డంతా ధియేటర్ లా ఉండేది.. ముందు వరుసకోసం ముందుగానే, గోనేసంచె లేదా చిన్న పీట వేసి రిజర్వ్ చేసుకోవాలి.. విజ్జగాడు ఇన్ప్లియన్స్ చేసి ముందు వరుసలో పట్టేవాడు సీటు.

కానీ ఒక్కొక్కసారి బాగోని సినిమాకైతే, ప్రొజెక్టర్ ఆపరేటర్ కి టీ తెచ్చి మంచి చేసుకుని, రీలు ఎలాపెడుతున్నాడో, చక్రం ఎలా తిరుగుతుందో లాంటి విషయాలు నోరు వదిలేసి విచిత్రంగా చూసేవాళ్ళం.

“ఒరే.. విజ్జిగా.. ఇందులో గొప్ప టెక్కునిక్కుందిరా..!, ఎప్పటికైనా సినిమాతీయ్యాల్రోయ్..”, అని నేనంటే.. “హా.. తీద్దాం రా.. తీద్దాం.. మన సూపర్ హీరోని పెట్టి తీద్దాం..”, అనేవాడు నాతో.

“ఎల్లి సినిమా చూడండ్రా కూకొని.. , సినిమా తీస్తాడంట.. సినిమా.. తెరకి అడ్డంగా నిలబడి చెబుతున్నాడు పెద్ద…“, అని తలమీద ఒక్కటిచ్చేవాడు.. ఇద్దరికి మా ఊరి మున్సీబు తాత. కాస్తా సీరియస్ గా ఆయన్ని చూసి తిట్లన్నీ మనసులోతిట్టేసుకుని.. కళ్ళనీళ్ళతో.. సినిమా చూసేవాళ్ళం.

వాడికినాకు పెద్ద గొడవలొచ్చిన సందర్బాలు తక్కువ. ఒకేఒకసారి వాడికి నాకు గొడవొచ్చి మాట్లాడుకోలేదు. ఒకరోజు పొద్దున్న నేను మంచంపైనుండిలేచి వంట గదిలోకొచ్చా.. “ఏరా!!.. పొద్దున్న ఎవరైనా ఇంట్లోకొచ్చారా..”, అని అమ్మ అడిగింది నన్ను.. “ఏమోనమ్మా.. తెలియదు.. నేను నిద్రపోతున్నా..”, అన్నానేను..ఆవులిస్తూ. “సరిగ్గా గుర్తుచేసుకో”, అంది అమ్మ మళ్ళీ. “హా.. విజ్జిగాడు పాలుతీసుకొచ్చి బల్లపై పెట్టాడు.. నన్ను లేపాడు కూడా.. ఇంకా నిద్రపోవాలిరా అంటే.. వెళ్ళిపోయాడు.. ఏ ఎందుకమ్మా?”, అని అడిగా అమ్మని.. “ఏమీలేదురా.. “,అని మాటదాటేసింది అమ్మ.

ఆరోజునుండి రెండురోజులు నాకు కనబడకుండా తిరిగాడు విజ్జిగాడు.. ఏమైందో తెలియదు.. అక్కని అడిగా.. కూరగాయలకోసం పెట్టిన పదిరూపాయలనోటు కనబడడంలేదని అమ్మవాడిని నిలదీసిందని.. నాన్న కూడా మావాడితో తిరిగి చెడగొడుతున్నావ్ వాడిని అని తిట్టార్రా, తరువాత పదిరూపాయల నోటు బల్లకింద కనపడిందిరా పాపం అని విషయం చెప్పింది అక్క.

అమ్మానాన్నా వాడిపై కక్ష కట్టారని తెలుసుకున్నా. వాడికోసం వెదికా.. సాయంత్రానికి దొరకాడు.. ఊరిచివర చింతచెట్టుక్రింద బండిపై ఆడుతూ., పలకరించా.. నావైపు కోపంగా చూసాడు.. “ఒరే..! నువ్వునాతో తిరక్కురా చెడిపోతావ్.. వెళ్ళి చదువుకో…, నేను దొంగతనం ఒకటిచేసాను ఈరోజు.. ఆ దొంగబుద్దులన్నీ నీక్కూడా అంటుకుంటాయ్ వెళ్ళరా.. “, అన్నాడు కోపంతో.. నాకు కన్నీళ్ళొచ్చాయి.. ఏడ్చేసాను.. మళ్ళీవాడే నన్ను దగ్గరకు వచ్చి ఊరుకోరా.. అంటూ ఓదార్చాడు.

ఇవన్నీ కాస్త చిన్నప్పుడు. నిక్కర్లు మాని ప్యాంట్లు వేసుకునే వయసులోనైతే చేసిన అల్లర్లు చెప్పనక్కర్లేదు. అంతా కలిసి సైకిళ్ళపై సెకండ్ షో  సినిమాలు. అర్ధరాత్రి  చెరకుతోటల్లో కూర్చుని చెరకుగడలు తింటూ సినిమా కబుర్లుచెప్పుకోవడం. ప్రక్కవూరి జాతర్లకు, రికార్డంగ్ డ్యాన్సులకు తిరగడం. నన్నైతే ఇంట్లో బయటకు పంపించేవారుకాదు.. వేసవికాలంలో అందరం డాబాపై పడుకునేవాళ్ళం.. కాబట్టి.. అందరూ పడుకున్నాకా నెమ్మదిగా ఎవరికీతెలియకుండా చెక్కేసి ఏటిగట్టువంతెన దగ్గర చీకట్లో ఎదురుచూసేవాళ్ళం మిగతావారికోసం.. అక్కడ అందరం కలుసుకుని.. ఏం చేయాలో ఆరోజు ప్లాన్ చేసేవాళ్ళం.

సంక్రాంతి బోగి పండుగ రేపనగా ముందు రోజు రాత్రి పదకొండింటికి మొదలయ్యేది మా పుల్లలూ, పిడకలూ వేట.. తరువాతరోజు బోగిమంటకోసం.. ఎవడైతే నాది ఇదపోయింది, అదిపోయింది అని బాగా కేకలేసి తిడతాడో వాడింట్లోవే ఎక్కువ పట్టుకొచ్చేవాళ్ళం. తెల్లవారేసరికి  ఏది కనబడకుండా కాల్చేసేవాళ్ళం. మేం ఆరోజు రిలీజుయైన కొత్తసినిమాల చూడడానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి కనబడేవాళ్ళం.., వచ్చేసరికి తిట్లైపోయి.. అందరూ మర్చిపోయేవారు జరిగినవిషయాలు. ఇక శ్రీరామనవమి కి ముందురోజు రాత్రి పందిర్లువేయడం, తోరణాలు కట్టడం, కొబ్బరాకులు జండాలతో అలంకరించడం అవీ చాలా పద్దతిగా చేసేవాళ్ళం.. ఈ పండుగల్లో చేసే తాళాల భజన, కోలాటాలు అంటే నాకు చాలా ఇష్టం. కష్టపడి నేర్చుకున్నాం కూడా. రాత్రంతా భజనలు చేసి అలసిపోయి ఆకలేస్తే తోటల్లోకి పోయి తినిరావడమే పని మాకు.

విజ్జగాడు పూర్తిగా వ్యవసాయపనుల్లో పడ్డాడు. వాడు పడినంత కష్టం నేనెప్పుడూ పడలేదు. చాలా కష్టపడేవాడు.. వాడేకాదు మా ఊరిజనమంతా అంతే..వేసవి మండుటెండలో నడుంవొంచి ఐదారుగురు ఒక ఎకరం వరిపొలం కోయడం మాటలా?, నేనలా చేస్తే. కళ్ళుతిరిగి పడటమో లేక ఒక నెలరోజులు వొంగి నడవడమో చెస్తామేమో.. నేను చదువుకోవడం  వలన చాలా సున్నితంగా పెరిగా..

ఎండలో అంతలా కష్టపడి పనిచేసినా పంటచేతికొచ్చే సమయంలో వర్షాలు వరదలూ వలన లాభం చేతికందేది కాదు. మామూలు రోజుల్లో విజ్జిగాడు రోజుకూలీ పనులు కూడా చేసేవాడు.

వాడు పొలంపనుల్లో, నేను చదువులో బిజీయై మా తిరగుళ్ళు కాస్త తగ్గాయి. ఇక రాత్రి సమయాల్లో పరిమితమైపోయాయి.

నాకు దూరంగా ఉద్యోగం వచ్చింది అప్పుడప్పుడూ ఇంటికి వెళ్ళేవాడిని.. ఇక వెళ్ళినప్పుడే కలుసుకునేవాళ్ళం. పోను వాడు చేసేవాడు కాదు. నేను ఇంటికి చేసినప్పుడు కూడా ఎప్పుడూ దొరికేవాడు కాదు. నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా నాకు ఇష్టమైనవన్నీ తెచ్చి ఇవ్వడంలో బిజీయైపోయేవాడు విజ్జగాడు. కానీ నేను వాడికి ఏమి తీసుకెళ్ళాలా అని అలోచించేవాడిని.. ఒకసారైతే.. వాడికోసం బట్టలు కొని తీసుకెళ్ళిచ్చా.. “ఏరా.. !, నాకూ టీషర్ట్ జీన్స్ తేవొచ్చుగా.. ఏ.. నేనేసుకోకూడదా.. “, అన్నాడు సరదాగా…,”లేదురా!!.. మన ఊరిలో అవేసుకుంటే నవ్వుతారని ఇవే తెచ్చారా..”, అన్నాను నేను. వాడికేది ఇష్టమో కూడా తెలుకులేకపోయా.. కానీ నాకేది ఇష్షమో అన్నీవాడికి తెలుసు.

వాడిదగ్గరున్నన్ని రోజులూ టీషర్ట్స్, జీన్స్, షూష్.. అవి వేయడం మానేసి సింపుల్ గా ఇంతకు ముందు ఎలా ఉండేవాడినో అలాగే ఉండేవాడిని వాడితో .. వాడెదురుగుండా సెల్ పోన్లో మాట్లేడేవాడిని కాదు.. ఇంగ్లీషులో మాట్లాడి కటింగులిస్తున్నట్లుంటుందని, కొలీగ్స్ ఫోన్ చేస్తారేమోనని సెల్ స్విచ్చాఫ్ చేసి ఇంటిలో పెట్టేసేవాడిని. ఎక్కడ తేడాగా ఉన్నావాడు నువ్వుమారిపోయావ్ రా అని అంటాడేమోనని, బాధపడతాడేమోనని మరి భయమేమోనాకు?.

సెలవులు ఎక్కువ దొరకక ఎన్నోరోజులుండేవాడిని కాదు ఇంట్లో, ఒకవేళ ఉన్నా ఒకటి రొండు రోజులు వాడితో కలిసినా, మిగతారోజులు చుట్లాలిల్లకి వెళ్ళడమే సరిపోయేది.

ఏదైనా ఇంతకుముందులా వాడితో మనసువిప్పిమాట్లాడలేకపోతున్నందుకు బాధగానే ఉంది..

ఎవరో తట్టినట్లు అనిపించి.. ఉలిక్కిపడి  పుస్తకం మూసి చూసేసరికి పక్కన ఒక పెద్దాయన…”బాబూ.. నీది ఏ బెర్తు”, అని అడిగారు శశిని. “మిడిల్ బెర్తండి”, అన్నాడు శశి. “కాస్తా పై బెర్తులో సర్దుకుంటావా.. లేడీసు ఉన్నారు.. “, అని పెద్దాయని రిక్వెస్ట్ చేసాడు.. సరేనని.. పైబెర్తు ఎక్కి పడుకున్నాడు శశి.

ఇంటికి చేరుకున్నాడు.. స్టేషన్ నుండి ఆటోలో ప్రయాణించి. బ్యాగ్ మూలపడేసి.. బట్టలుమార్చుకున్నాడు స్నానంకోసం రడీఅవుతూ. “విజ్జిగాడేడమ్మా??”, అని అమ్మని అడిగాడు శశి.

“అదేరా.. నువ్వొస్తున్నావని.. నీకిష్టమని చింతకాయ చిన్నచేపలు కూర చేయండి.. చేపలు తెస్తా.. అని వెళ్ళాడు.. మరి ఇంకా రాలేదు.. ఇప్పుడు ఆ నాగన్నచేత బలవంతంగా వల వేయించైనా చేపలు పట్టించి మరి తెస్తాడు నీ కోసం”, అని నవ్వుతూ చెప్పింది అమ్మ. స్నానంచేసి రడీ అయ్యే సరికి విజ్జగాడు చేపల బుట్టతో వచ్చాడు.. శశిని చూసి, “ఏరా!.. ఎలా ఉన్నావ్, ప్రయాణం బాగా జరిగిందా.. “,అని పలకరిస్తూ చేపల బుట్ట అమ్మకి అందించాడు. బాగానే ఉన్నాన్రా.. నువ్వెలా ఉన్నావ్ రా.. అని కాసేపు కబుర్లు చెప్పుకున్నారిద్దరూ..

విజ్జిగాడికోసం తెచ్చిన టీషర్ట్ , జీన్చ్ ఇచ్చాడు శశి.  టీ త్రాగి కాసేపు ఉన్నాకా.. బయటకు బయలుదేరారిద్దరూ.

“పనులెలా నడుస్తున్నాయ్ రా.. మనవాళ్ళంతా ఎలా ఉన్నారు.. నిన్ను నాతో తీసుకెళదామంటే.. అక్కడేముందిరా.. నువ్ చెయ్యడానికి.. నేను దగ్గరికొచ్చి సెటిలైపోయాకా.. ఏదైనా బిజినెస్ పెడదాం”, అన్నాడు శశి..

“అవునురా.. చూడాలి.. వ్యవసాయం పనులు అసలు బాగోడంలేదు. కలిసిరావడంలేదురా.. మనోళ్ళంతా దుబాయ్.. పోతున్నారు. నేను కూడా చూస్తున్నా మరి ఏమైతుందో చూడాలి”, అన్నాడు విజ్జగాడు.

“అదీ.. మంచిదేరా.. ప్రయత్నించు..”, అని సలహా ఇచ్చాడు శశి.

వారంరోజులు ఒక్కరోజులా గడిచిపోయాయి.. ఒకేఒక్క సినిమాకి వెళ్లారు ఇద్దరూ కలిసి.

తిరుగుప్రయాణంతో బయలుదేరాడు శశి.. జోరున వర్షం మొదలయ్యింది.. తోడుగా వస్తాన్నాడు విజ్జగాడు స్టేషన్ వరకూ.. వద్దు వర్షం నేను ఆటోలో వెళ్ళిపోతా అన్నా వినకుండా  కూడా వచ్చాడు.. గొడుగు చిన్నది కావడంతో విజ్జగాడు మొత్తం తడిసిపోయాడు..

స్టేషన్లో నిలబడ్డారిద్దరూ.. “మొత్తం తడిసిపోయావురా…”, అని శశి అంటే.. “పర్లేదురా.. ఇంటికి వెళ్ళిపోతాగా.. పర్లేదు”, అన్నాడు విజ్జిగాడు.

“ఎలా వెళతావ్ ఇంటికి.., వర్షంబాగా ఎక్కువగా ఉంది..?”, అని అడిగాడు శశి

“ఆటోలో వెళతారా.. “, అన్నాడు విజ్జగాడు, “ఐతే.. ఇది ఉంచరా..”, అని జేబులోనుండి.. ఒక వందనోటు తీసిచ్చాడు.. “వద్దురా.. వద్దు.. నాదగ్గరున్నాయ్.. “, అని ఎంత ప్రయత్నించినా తీసుకోలేదు డబ్బులు.. విజ్జిగాడు.. ఇంకా ఎక్కువ బలవంతపెడితే.. వాడెమైనా అనుకుంటాడేమోనని శశి ఏమీ మాట్లాడకుండా.. వందనోటు జేబులో పెట్టేసుకున్నాడు.

ట్రైన్ వచ్చింది.. విజ్జిగాడు.. గబగబా.. లగేజి లాక్కుని.. ఎక్కి అంతా సర్దేసాడు.. “జాగ్రత్తరా.. జాగ్రత్తగా ఉండు..”, అని చెప్పాడు శశికి..

ట్రైన్ కదిలింది.. టాటా చెబుతూ ఫ్లాట్ ఫాం పై నిలబడ్డాడు విజ్జగాడు.., అలా టాటా చెబుతూనే.. విజ్జగాడికి దూరంగావెళుతున్నకొద్దీ శశి కంటినిండా కన్నీళ్ళు రాసాగాయి…

ఇప్పటికే.. నీకు నేను చాలా ఋణపడిపోయా..వచ్చిన ప్రతీసారి ఇంకా ఋణపడుతున్నా.. నేనేలా నీ ఋణంతీర్చుకోనురా.. , నీలాంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టం…అని మనసులో అనుకున్నాడు శశి.

ఇంటర్మీడియెట్ వయసు
అప్పటికి నాలుగోసారి తలదువ్వడం, వెళ్ళి  నీళ్ళతో జుట్టును తడపడం. మళ్ళీదువ్వడం, రకరకాల హెయిర్ స్టైల్స్ మార్చడం, కానీ ఏదీ నచ్చడంలేదు. అతని పేరు రామ్. టెన్త్ క్లాసు పూర్తిచేసి ఇంటర్ గవర్నమెంటు కాలేజ్ లో జాయిన్ అయ్యి రెండు రోజులయ్యింది. కాలేజి ఇంటికి దగ్గరకావటంతో నడిచేవెళుతుంటాడు. టైమ్ అయ్యేంతవరకూ తలదువ్వతూనే ఉంటాడు. అద్దం ముందు రోజుకు కనీసం నాలుగు గంటలు గడపనిదే అతనికి ఆరోజు ఏదో వెలితిగా ఉంటుంది. రామ్ వాళ్ళమ్మ వంట పనులు కానిస్తూ, టిఫిన్ బాక్స్ రడీ చేస్తూ ఓరకంటితో రామ్ ని గమనిస్తూనే ఉంది. టైమవుతుంది అని చెప్పి చెప్పి విసుగుపుట్టి మానేసింది ఇక చెప్పడం. టైమ్ చూసాడు, 9:00 అయ్యింది. కాలేజ్ కూడా 9:00 కే. ఉలిక్కిపడి బుక్స్ చేత పట్టి, ఒకసారి మళ్ళీ అద్దంముందు క్రాఫ్ సర్దుకుని వంటగదిలోనికి పరుగుతీసాడు. “అమ్మా! నువ్వెప్పుడూ లేటే, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ రెండూ ఒకచోట పెట్టొచ్చుగా”, అన్నాడు చిరాకుగా లంచ్ బాక్స్ చేతపట్టుకుని. ఆమెవంక చూడకుండానే పరుగుతీసాడు. చూస్తే పెద్దక్లాసు ఉంటుందని తెలుసు అతనికి.

క్లాస్ వెనుక డోర్ నుండి శబ్దంరాకుండా వచ్చి కూర్చున్నాడు. సార్ ఏదో సీరియస్ గా.. టీటాలు, ఇంటిగ్రల్స్ తో ఏవో పెద్ద పెద్ద లెక్కలు బోర్డ్ పై రాసేస్తున్నారు. ఆయన లెక్కమొదలుపెట్టేటపుడు అయిదుగురో ఆరుగురో ఉంటారు క్లాసులో, పూర్తయ్యేసరికి మెత్తం ముప్పయ్ మందితో నిండిపోతుంది క్లాసంతా. కానీ.. తెలిసినా లేటేంటని ఎవరినీ నిలదీయరు పాపం, ఆయన పనేదో ఆయనదే.

రామ్ తన ఫ్రెండ్ వైపు చూసి ఏదో సైగ చేసాడు.  ఫ్రెండ్ తల ఊపి, నేనున్నాగా అన్నట్లు సైగ చేసాడు.  హమ్మయ్య అన్నట్లు ఊపిరి పీల్చుకున్నాడు రామ్. ఇంతకీ  విషయం అటండెన్స్.  ఒకడు వస్తేచాలు, మెత్తం ముప్పయిమందికీ  పలికే టేలెంట్  వున్నవాళ్ళు  ఉన్నారు క్లాసులో. మూడు అవర్స్ అయిపోయాయ్ లంచ్ కి బయలుదేరారు అందరూ. కబుర్లతో, జోకులు, నవ్వులతో ముగిసింది లంచ్. ఇక అవర్స్ ఏమీ ఉండవ్ ఆ రోజుకు.. ఉన్నా ఎప్పుడో ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయ్ తప్ప,. లేకపోతే ఆటలాడటం, కబుర్లు, ఒకరిని ఒకరు ఆటపట్టించుకోవటంతో రోజు గడుస్తుంటుంది.

“ఒరే రేపు తేజ సినిమా రా!.. టికెట్స్ సంపాదించరా, అందరికీ!, .. మార్నింగు షో”, అని చెప్పాడు రామ్.

“ఒరే! రేపు ఫిజిక్స్ క్లాసురా బాబు.., సార్ చంపేస్తారు అందరం క్లాసుకి రాకపోతే”,అని భయంగా అన్నాడు వెంకట్.

“పర్లేదురా, ఆయన క్లాసు మళ్ళీ మూడు రోజులు లేదు, గుర్తుండదులే.. మర్చిపోతారుల్లే, ఆయన ఇంటి దగ్గర ట్యూషన్స్ ,టెన్సన్స్.. ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయ్. నువ్యు మాత్రం మర్చిపోకు, టీవీలో యాడ్ చూపిస్తున్నాడు, సోలిడ్.. ,హీరోయిన్ కొత్త, హీరో కొత్త.. ఆర్పీ సాంగ్స్. ఖచ్ఛితంగా ఒక మాస్ మషాళా సాంగ్ ఉంటుంది. ఇక డాన్సులే డాన్సులు…ధియేటర్లో… కుమ్మేద్దాం”, అన్నాడు రామ్.

సినిమా చూడటమూ అయ్యింది, ఫిజిక్స్ సార్ చేత క్లాసులో తిట్లుతినటమూ అయ్యింది. రామ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వారం రోజుల్లో తొమ్మిదిసార్లు అదే సినిమా చూసేసారు. పాపం రామ్ నాలుగుసార్లే  చూడగలిగాడు.. ఎందుకంటే, ఫస్ట్ షోలకీ, సెకండ్ షోలకీ వెళ్ళడు.. ఇంట్లో వాళ్ళ నాన్నకి భయపడి.

“ఒరే!.. ఆపరా ఎక్కడికో చెప్పవ్.. ఎందుకింత దూరం.. ఏమన్నా అడిగితే మాట్లాడాలంటావ్.. ఏంటి విషయం”, స్పీడుగా బైకు నడుపుతున్న రామ్ ని అడిగాడు వెంకట్.  ప్రక్కనే ఉన్న టీ షాప్ దగ్గర ఆపాడు బైక్ ని.  పార్క్ చేసి లాక్ వేసి, కీస్ వెంకట్ చేతికిచ్చి..టీ ఆర్డర్ చెప్పి.. మూలగా ఉన్న టేబుల్ పై కూర్చున్నారిద్దరూ.

వెంకట్ జేబులోంచి సిగరెట్ ప్యాకట్ తీసుకుని సిగరెట్ వెలిగించి చెప్పడం మెదలుపెట్టాడు రామ్.

“ఏంలేదురా.. అందరికీ గాళ్ ఫండ్స్ ఉన్నార్రా. నాకూ లైఫ్ భోర్ కొడుతుంది. ఈ మధ్య ఆ స్వప్నకి బాగా ఎట్రాక్ట్ అయిపోతున్నా కూడా.. ప్రపోజ్ చేద్దామనుకుంటున్నా.. నువ్వేమైనా సలహా ఇస్తావని నిన్ను అడుగుతున్నా”, అని అసలు విషయం చెప్పాడు రామ్..

“ఓహో!.. అనుకున్నా తమరు ఇలాటిది ఏదో నడుపుతున్నారని.. ఈ మధ్య ఆ అమ్మాయితో జోకులు, నవ్వులు.. చూస్తున్నాగా.., మరి.. ఇంకే.. కానీయ్..నేనున్నాగా.  బట్.. డేంజర్రోయ్.. అది వాగుడుకాయ్.. నీ జేబులు ఖాళీ కూడా.. , దేనికీ సిగ్గు పడదు.., మొన్న రెండుసార్లు సినిమా టికెట్స్ నేనే తీసానా!!.. తరువాత డబ్బులు అడుగుతుంటే..ఏ డబ్బులు అంటుందే తప్ప ఇవ్వదే!… నాకింక విసుగుపుట్టి అడగటం మానేసా.. ఇంకా ఏమైనా అంటే మా నాన్నకి అంతవుంది, ఇంతవుంది.. కారువుంది అని కబుర్లు.. చెబుతుంది. పర్స్ లో ఎప్పుడూ పదిరూపాయలుండవ్..!!,  జాగ్రత్తరా మరి”, అన్నాడు వెంకట్ రామ్ తో.

“అవన్నీ నే చూసుకుంటాలేరా.. ఛీ ఆ నల్లశీనుగాడు కూడా.. గాళ్ ఫ్రెండ్ ని మెయింటేన్ చేస్తున్నాడ్రా..! మనకులేకపోతే అవమానకరం.. నేను మేనేజ్ చేస్తాగా.. నువ్వు నాకు సలహా ఇస్తుండు అంతే!!”, అన్నాడు ధీమాగా రామ్.

“రోజూ వందలు వందలు నేనేక్కడ తెచ్చిచ్చేది.. వెళ్ళి మీ నాన్ననడుగు. మొన్నేకదా ఏవో బుక్స్ అన్నావ్.., ట్యూషన్ ఫీజులన్నావ్”, అని చిరాగ్గా చెప్పింది రామ్ తో వాళ్ళమ్మ.

“ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయమ్మా.. ఈ బుక్స్ కొనుక్కోవాలి మరి.. ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు.. ఇన్ని డబ్బులు అంటే..? నేనేమన్నా దాచుకుంటున్నావనుకుంటున్నావా?, సినిమాలకి వెళ్ళే డబ్బులు నీకు చెప్పే తీసుకుంటాగా.. ఇవి బుక్స్ కి అంటే నమ్మవే.?.” అని అలిగి తన గదిలో వెళ్ళిపోయాడు.

కొంతసేపటికి అమ్మడబ్బులతో వస్తుందని తెలుసు. అలాగే జరిగింది కూడాను!!.

ఎలాగైతే స్వప్నతో ఐస్ క్రీమ్ పార్లర్ల వెంట తిరగటం, సినిమాలు షికార్లు కొట్టడం అలవాటయిపోయింది. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి.. కానీ రామ్ కి అసలు చదువుపై ధ్యాసే వుండటంలేదు ఎప్పుడూ  స్వప్నగురించే ఆలోచన.. ఎలా తనని  మెప్పించి ఎలా తన దగ్గర గొప్పగా పేరు సంపాదించాలన్న తపన, అనవసరపు ప్రేలాపనలు,కబుర్లు చెప్పడంలో కాలం గడుస్తుంది. ఆ అమ్మాయి ఐస్ క్రీములు తిని లావవుతుంది. రామ్ కి ఇంట్లో డబ్బులు తీసుకునే ప్రతిరోజు ఒకగండంలా గడుస్తుంది.

తనకు సంభందించిన  ఖర్చులన్నీ తగ్గించేసాడు పాపం..

ఒకప్పుడు టీవీలో యాడ్ చూసి, “అమ్మాయిలంతా వెనక పడే..” డియోడరెంట్ స్ప్రే వాడేవాడు.. కొంత కాస్ట్లీ అయినా… ,కానీ అమ్మాయిలు టీవీలో చూపించినట్లు వెనుక పడ్లేదు!,పాపం.  ఇప్పుడు చేతిలో డబ్బులులేక మొత్తం స్ప్రే వాడటమే మానేసాడు!!, మొత్తం డబ్బులన్నీ స్వప్న ఖర్చులకే సరిపోతున్నాయి. ఆ అమ్మా యి ఎప్పుడూ చేతిలో పర్సు పట్టుకుని తిరుగుతుంది తప్ప, పర్సులో ఏముంటుందో  ఎప్పుడూ చూడలేదు రామ్.. బిల్ రాగానే, నేనిస్తా అని పర్స్ పై చెయ్యివెయ్యడం, రామ్..వద్దు నేనిస్తా అని బిల్ పే చేయటం.. మాములైపోయింది.. కానీ ఇప్పుడు నువ్వే పే చెయ్యి అన్నట్లుగా అసలు పర్స్ పైన చెయ్యికూడా వేయడంలేదు కనీసం. పార్లర్ వాడు కూడా రేట్లు పెంచేసాడు. ఏదో ఎవరికీ కనపడని చోట వుందికదా అని , అక్కడికే వెళ్ళక తప్పడంలేదు రామ్ కి.

పరీక్ష రిజల్ట్స్ రానే వచ్చాయి, ఒక్కసారిగా రామ్ మొహం వెలిగిపోయింది రిజల్ట్స్ చూసి. రేపు ఎగ్జామ్ అనగా కూడా పుస్తకం తీయకుండా, అసలు టెన్సన్ పడకుండా వ్రాసాడు పరీక్షలు. అతనికి  తెలుసు ఈ సారి కనీసం ఐదు సబ్జక్ట్స్ ఉంటాయని, కానీ లక్కు కొద్దీ మూడు మిగిలాయి…మిగతావి ఏవో పాస్ మార్కులతో గట్టేక్కాసాయి. చాలా లక్కీగా అయిపోయాయే సబ్జక్ట్స్ ఆశ్చర్యం అనుకున్నాడు మనసులో రామ్.

ఇప్పుడు మూడు సబ్జక్ట్స్ ఉన్నాయని ఇంట్లో ఎలా చెప్పాలా అన్న ఆలోచన మనసులోకి రాగానే.. టెన్సన్ మొదలయ్యింది. అమ్మో!, నాన్నకి తెలిస్తే.. చంపేస్తారు.

రామ్ కి వాళ్ళ మావయ్యతో మంచి చనువు వుంది, వాళ్ళమ్మకి సొంత తమ్ముడే అయినా ఆయన చాలా సరదాగా వుండే మనిషి. కానీ ఆయన ప్రస్తుతం ఊళ్ళో లేకపోవడంతో రామ్ కి టెన్సన్ ఎక్కువైంది..

“ఇప్పుడు నాన్నకి ఎవడో వెధవ బజారులో చెప్పేస్తాడు రిజల్ట్స్ వచ్చాయని.. అప్పుడు నన్ను పిలిచి అడిగేస్తారు..ఆయన ముందు ఏదీ దాచలేం.. చెప్పక తప్పదు నిజం.. ముందే చెప్పేస్తే కొన్ని తిట్లు తగ్గుతాయి..” అని రామ్ ఆలోచిస్తున్నాడు. ఇక ఈరోజే ..ఏదోలా అమ్మకి చెప్పేయడం మంచిదని నిర్ణయించుకున్నాడు.

ఇంటికి త్వరగా చేరుకున్నాడు. అమ్మ వంట గదిలో ఉందని తెలుసుకుని.. బుక్స్  తన గదిలో పడేసి నెమ్మదిగా వంటగదిలోకి చేరుకున్నాడు. ఇవ్వాళ త్వరగా వచ్చేసావేంటి?,అంటే.. ఏదో కధ చెప్పి కవర్ చేసుకున్నాడు. వాళ్ళమ్మ కూరగాయలు కోయడంలో నిమగ్నమైవుంది. అవసరమున్నా లేకున్నా ఏదొక విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడే ఉన్న క్యారెట్ తీసుకుని కరకరా నములుతూ ఫ్రెండ్స్ విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. విషయంలో అంత నవ్వులేకపోయినా బిగ్గరగా నవ్వటం, మళ్ళీ అమ్మ వంక చూసి ఆమె నవ్వకపోయేసరికి నవ్వుఆపేసి  వేరే టాపిక్ మార్చడం చేస్తున్నాడు రామ్. వాళ్ళమ్మ మాత్రం ఊ అనటం తప్ప ఏమీ సమాధానం లేదు.  ఇక చెప్పటానికి ఏమీలేవన్నట్లు అయ్యింది రామ్  పరిస్ధితి.

ఉలిక్కి పడేంత శబ్దంతో విజిల్ వేసింది కుక్కర్.  అలా నాలుగు విజిల్స్ వేసే సరికి అమ్మ గ్యాస్ స్టౌ దగ్గరకు వెళ్ళడానికి లేవబోవడం గమనించాడు రామ్.  గబుక్కున కూర్చున్న చోటు నుండి లేచి గ్యాస్ స్టౌ పైనున్న కుక్కర్ ని దించి ప్రక్కనే ఉన్న నీళ్ళ గిన్నె స్టౌపై పెట్టి మళ్ళీ యధాస్ధానానికి చేరుకున్నాడు.. కొంత సేపుమౌనంగా కూర్చున్నాడు.. తరువాత టాపిక్ ఏంటీ? ఎలా మొదలుపెట్టి సబ్జక్ట్స్ విషయంలోకి తీసుకొద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాడు రామ్ .

“ఏం కావాలి…ఈసారి పెద్దమొత్తంలో డబ్బులుకావాలా?”,అని అడిగింది అమ్మ తన పని చేసుకుంటూనే..

దెబ్బకు షాక్ తిన్నట్లయ్యింది రామ్ కి. ఏంటీ అమ్మ ఇలా అడిగేసింది..??, మనం కాకా పడుతున్నట్లు ఎలా తెలిసిందబ్బా? అని అనుకుంటూనే తటపటాయించుకుని..

“లేదు లేదు.. అటువంటిది ఏం లేదు”, అన్నాడు నసుగుతూ. “డబ్బులు ఏంకాదు.. మరి.. అదీ..!, నా రిజల్ట్స్ వచ్చాయి..”, అని అసలు విషయం చల్లగా చెప్పాడు..

“ఎన్ని సబ్జక్ట్స్ వున్నాయి”, అని అంది అమ్మ. “మూడు ”,అన్నాడు నెమ్మదిగా,నేలచూపులు చూస్తూ.

“సరిగ్గా చదివి వ్రాస్తే, ఇప్పుడు దొంగలాగా చెప్పటం తప్పేది కదా?, నీ బాగుకోసమే కదా? ఎవరుచెప్పినా.. నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లవాడివా?, కొట్టి చదివించడానికి. నీ భవిష్యత్తు ఏంటో నువ్వే తెలుసుకుని చదవాలి. మాకుమాత్రం ఏమి తెలుసు..?, మీ నాన్నకు నేను చెబుతాలే.., కాని నువ్యు ఈ సారైనా బాగా చదువు.., లేకపోతే ఒక సంవత్సరం పాడవుతుంది.. ఒక్కసారి చదువు ఆగిందంటే.. ఇక అంతే మరి!!”, అని అమ్మ చెప్పింది.

రామ్ కి గుండెలపైనుండి పెద్ద భారం దింపినట్లైంది. ఆరోజు రాత్రంతా నిద్రలేకుండా ఆలోచించాడు. ఈసారి బాగా చదవాలి అని.. స్వప్నని కలవకూడదని.. ఫ్రెండ్స్ తో సినిమాలు కూడా తగ్గించాలని, కొన్నాళ్ళు అజ్ఞాతవాసం చేసినట్లు అందరికీ దూరంగా ఉండి చదవాలని భయంకరమైన నిర్ణయాలు తీసుకున్నాడు.

తెల్లవారింది… రామ్ యొక్క మాములు దినచర్య మొదలయ్యింది, రాత్రి వచ్చిన పీడకలలాగా నిర్ణయించుకున్నదంతా వాయిదా వేసాడు… ఆ.. ఇంకా పది నెలలు తరువాత విషయం. ఈ లోపుగా ఎందుకు టెన్సన్ అని తనకి తాను సర్దిచెప్పుకున్నాడు.

గొప్ప లవ్ జంట అని కాలేజంతా పేరొచ్చేసింది రామ్ ,స్వప్నలకి. ప్రతిరోజులాగే పార్లర్లో కలవాటాలు ఏమీ తగ్గలేదు. “స్వప్నా..!, ఒకటడుగుతాను చెబుతావా?… నేనంటే ఇష్టమేనా..??”, అని అడిగాడు రామ్.

“హా ..!!,  అదేంటి ఇప్పుడు సడెన్ గా ఏమైంది నీకు??”, అంది స్వప్న కనుబొమలు చిట్లిస్తూ.

“ఏమీలేదు..!ఊరికే అడిగా.. ,నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావో తెలుసుకుందామని… చెప్పు..?”, అని దూరంగా నిలబడి ఉన్న వెయిటర్ వంక చూసాడు.. ఆర్డర్.. అన్నట్లు.

“రామ్.,ఇంతని చెప్పలేను కానీ.. చాలా!!.. ప్రేమిస్తున్నాను.. DDLJ లో కాజోల్, షారుఖ్ ని ప్రేమించినంతదానికన్నా.. .,  లైలా, మజ్ను సినిమా ఏదీ చూడలేదుకానీ.. వాళ్ళలో అమ్మాయి కూడా ఎవరో తెలియదు..నిజంచెప్పాలంటే.. !!, కానీ.. అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా రామ్…”,అన్నీ సినిమా డైలాగులు బట్టీ పట్టి చెప్పినట్లు చెప్పేసింది స్వప్న.

“నీ ధ్యాసలో పడి నేనసలు ఎగ్జామ్స్ కి సరిగా చదవలేకపోయా తెలుసా.. ??, అందకే మూడు సబ్జక్ట్స్ ఉండిపోయాయి, కానీ నీవి అన్నీ అయిపోయాయి.. ఎలా… ?? ”,అని మాటలు మింగేసాడు.. రామ్.

“అంటే.. సబ్జక్స్ ఉంటేనే ప్రేమ ఉన్నట్లా?”, అని కోపంగా.. అంది స్వప్న.

“లేదు.. లేదు.., అడిగా అంతే.. నేనంటే నీకు ఎంతిష్టమో నాకు తెలుసులే..!”, అని రామ్ కవర్ చేసాడు.

ఇలా వాళ్ళ కబుర్లు సాగుతున్నాయి. వెయిటర్ చిరాకుగా మొహంతో ఆర్డర్ తెచ్చిచ్చాడు.  రామ్ తనని చూడగానే ఆర్డర్ ఏంటో తెలుసు అతనికి.. ఎప్పుడూ ఒకటే అర్డర్.. ఒకటే సమయం.. ఒకటే సినిమా డైలాగులు.. నో టిప్.. , అందుకే అతను మాత్రం ఎంతకాలం భరించగలడు పాపం, ఏమీ చేయలేక రామ్ పై చిరాకంతా.. తన చూపులతో చూపిస్తున్నాడు.

కాలం గడిచింది.. చిగురులు ఆకులుగా మారాయి…

“ఛీ..!!, ఎవడి భయంలేదు వీడికి.. ఇంకా చిన్నపిల్లాడా??, ఏమైనా.. బుజ్జగించి నచ్చచెప్పడానికి.. మొన్న సబ్జక్ట్స్ తప్పాను అన్నాడు.. ఊరుకున్నా.. వాడే  తెలుసుకుంటాడులే అని… బజారులో సిగరెట్లు కాల్చుతుంటే చూసా..అడిగితే బరితెగించి మరీ కాలుస్తాడని వదిలేసా…ఈరోజు ఒకమ్మాయితో ఇకఇకలు పకపకలు…  ప్రతిరోజు నడుపుతున్నాడంట..!!.ఈ బాగోతం.., బజారులో ప్రతివాడు నాకు చెప్పేవాడే.. వీడిగురించి..!. ప్రేమంట.!!, రేపు దండలువేసుకొచ్చి… నాన్నా!.. నన్ను ఆశీర్వదించండి అంటే..!, ఆశీర్వదించి చిన్న నవ్వునవ్వి వదిలేయాలి వాడిని.. వీడు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు నాకు….”, రామ్ వాళ్ళనాన్న బయటనుండి వచ్చి కాళ్ళుకడుక్కుంటూనే రామ్ గురించి తిట్ల  భారతం మొదలుపెట్టాడు.

రామ్ వాళ్ళమ్మ ఏమీ మాట్లాడకుండా ఆయన వెనకాలే తిరుగుతూ.. తిట్లన్నీ మౌనంగా వింటూ.. ఆయనకు కావలిసినవన్నీ అందిస్తుంది. వంటగదిలో భోజనం ఏర్పాట్లు చేసింది.. భోజనంచేస్తూ కూడా ఆయన తిట్లు కొనసాగాయి.. భోజనం పూర్తిచేసి చెయ్యితుడుచుకుంటూ అడిగాడు ఆమెను.. “నేను ఏంచేయను నువ్వే చెప్పు..?, పోనీ!, వాడిని స్వేచ్ఛలేకుండా పెంచానా?.. కావలసినవన్నీ ఇచ్చానుగా.. అదే ఇప్పుడు పొరపాటైంది… !”.

తనగదిలోకి వెళ్ళి మౌనంగా పడుకుని ఆలోచనలో పడ్డాడాయన. ఆమె దిగాలుగా హాలులో కూర్చుని ఆలోచించసాగింది.

తన తమ్ముడుకి కబురు పంపించి.. విషయంమొత్తం వివరించింది.. ఎలాగైనా నచ్చచెప్పమని బ్రతిమలాడింది.

“నీకెందుకు..వాడికి నేను చెబుతాగా.. రామ్ మంచివాడు.. వాడిది తెలియనివయసు..అంతే!, చెబితే అర్ధంచేసుకుంటాడు..

నేను చెబుతాగా..వాడికి.. ”,అని భరోసా ఇచ్చాడాయన.

చల్లని గాలి, పక్షుల కూతలు, అవి సడుస్తున్నప్పుడు వస్తున్న ఎండుటాకుల శబ్దం తప్ప ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంగా ఉంది. అది రామ్ వాళ్ళ కాలేజి గ్రౌండ్.. రామ్ వాళ్ళ మావయ్వతో కలసి పార్క్ లోని సిమెంటు బల్లపై కూర్చుని ఉన్నాడు..

కొంత సేపు మౌనంగా ఉన్నారిద్దరూ.

“ఇది కేవలం నువు చేస్తున్న తప్పు కాదు.. నీ వయసు తప్పు.. అందరికీ గాళ్ ఫ్రండ్స్ ఉన్నారు.. నాకూ ఒకరు ఉండాలి అనుకోవడం…, బైక్ పై అమ్మాయిలతో తిరగడం… నేను ఇంత.., నువ్వు ఇంత …అని పోటీపడడం.., ప్రతీది గొప్పకోసం చేసి ఆనందపడడం… అవి ఈ వయసుకు పిచ్చిలాంటివి…, నిజం చెప్పాలంటే.. అమ్మాయిల కి ఆకర్షింపబడడం మీరు ప్రేమనుకోవడం చూస్తే నాకు నవ్వొస్తుంది ఇపుడు… కానీ నీ వయసులో నేనూ అదే నిజం అని నమ్మినవాడినే…, మన మైండ్ మెట్యూరిటీ ఎప్పుడూ ఒకేలా ఉండదు రామ్!..,అది కాలంతోపాటు.. వయసుతో పాటు.. చుట్టూ ఉన్న వాతావరణప్రభావంతోపాటుగా మారుతూ ఉంటుంది. నాకు చిన్నప్పుడు ఉన్న అభిరుచులు ఇప్పుడు లేకపోవచ్చు..!!, ఇప్పుడు వున్న అభిరుచులు రేపు వుండకపోవచ్చుకూడా…!!, ఈరోజు నువు బాగా చేసా!, తిరుగిలేదు! అనుకున్న పని.. రేపు అది చాలా చిన్నది,సులవైనది…. అని నవ్వుతెప్పించవచ్చు.”, అని రామ్ కి మావయ్య.. చెప్పసాగాడు.

“కాదు మావయ్య.. ఇది ఆకర్షణ కానే కాదు..!, ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.., ఆమె లేకుండా నేను బ్రతకలేనేమో అని అనిపిస్తుంది!!. ఆమె కూడా అంతే.. నేనంటే చాలా ఇష్టం.. ఒక్క క్షణం ఒకరినొదిలి ఒకరు ఉండలేకపోతున్నాం.. , ఇక ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం… ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే… మమ్మల్ని విడదీయాలని ప్రయత్నిస్తే.. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి.. పెళ్ళిచేసుకుందాం అనుకుంటున్నాం…!, నువ్వు చెప్పేవన్నీ నాకు అర్ధమయ్యాయి.., మావయ్యా!, బ్రతకడం కష్టంకాదు.. నేనుకోరుకున్నది వదులుకుని రేపు అది నాకు దక్కకపోయి.. జీవితాంతం భాదపడుతూ బ్రతకలేను… “, అన్నాడు ధీనంగా రామ్.

“సరే!! ,ఇప్పుడు నిజంగా నీది ప్రేమే.. ఆకర్షణకాదు అనుకుందాం.!!,. అందరిలాకాకుండా నీది అసలైన ప్రేమకధ అని అనుకుందాం.  ఇంట్లోవాళ్ళు నీ బాగుకోరో.. లేక.. ఎందుకో మీ ఇద్దరూ కలవడం ఇష్టలేదనుకుందాం!…,నువ్వు ఏంచేస్తావ్.. దూరంగా పారిపోయి.. పెళ్ళిచేసుకుంటావ్… , అదీ… ఎవరికీ తెలియని చోటుకి.. అక్కడ నువ్వు ఎవరినో బ్రతిమలాడి.. చిన్న ఆవుని పెంచుతావు.. గడ్డి కోసి.., మేపి.. ,ఆ పాలు అమ్మి. . డబ్బులు సంపాదిస్తావ్..!, పొద్దున్నే లేచి వెళ్ళి దగ్గర్లో  ఇళ్ళల్లో పాలప్యాకెట్లు , పేపర్లు సప్లై చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తావ్… , మీ ఇద్దరూ కష్టాలను జయించి… జీవితాన్ని పోరాడుతున్నారనుకుంటూ.. సరదాగా ఒక పాట పాడుకోవడం.. ఈ లోగా వాళ్ళ నాన్నో .. మీ నాన్నో కొందరు మనుషులని పంపిస్తే వాళ్ళతో నువ్వు ఫైట్ చేయడం…,లేదా.. మీ ఫ్రండ్స్ అంతా కలిసి మిమ్మల్ని రక్షించడం.. కాలేజంతా కలిసి.. యూత్ తలచుకుంటే.. ఏదైనా సాధ్యం!, అని చాటిచెప్పడానికి… ఇది సినిమాకాదు రామ్… , జీవితం… నిజ జీవితంలో ఇలా జరిగిన సంఘటనలు నాకు చెప్పు… వాళ్ళల్లో ఎవరైనా జీవితాన్ని సాధించి.. హేపీ ఎండింగ్.. ఉందేమో చూపించు. ఇవి బుర్ర సరిగ్గా ఎదగని వాళ్ళో.. డబ్బులకోసమో..!, వాళ్ళ బిజినెస్ కోసమో!, సినిమాలు తీసి యూత్ ని ఆకర్షిస్తారు… అవి ఎంటర్ టైన్ మెంట్ కోసం కానీ!, అవే జీవితానికి అన్వయించుకోవడం తప్పు.

నీ వయసులో సచిన్, ద్రావిడ్.., జెన్నిఫర్ లోపెజ్, ఎమినెమ్.. ఇలా నీకు నచ్చినవాళ్ళపై విపరీతమైన వెర్రివుండడం.. వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే.. భాద కలగడం.. ఎవరైనా వాళ్ళని కామెంట్ చేస్తే.. వాళ్ళని చంపేయాలన్నంత కోపంరావడం… అది ఈ వయసు నైజం.  చిన్న ఎమోషన్స్ కి కూడా.. పెద్దగా రియాక్షన్స్ రావడం… అది.. ఈ వయసులో నీ శరీరంలో జరిగే మార్పులవలన.

నీ ఇంటర్మీడియెట్ వయసు..నీ జీవితానికి ఎంతో విలువైనది..!, ఈ రోజు తీసుకున్న నిర్ణయం నీ జీవిత లక్ష్యంపై ఖచ్ఛితంగా ప్రభావం చూపుతుంది. నీ వయసుకున్న వేడిని, ఉత్సాహాన్నీ.. నీ చదువుపైనో.. లేక నీ అభిరుచిపైనో పెట్టి.. అందరిలా కాకుండా.. సృజనాత్మకతో.. , నీదైన శైలితో జీవితాన్ని గెలిచి.. స్ధిర పడి.. ,అందరికీ చూపించు నీ సత్తా ఏంటో.

అప్పుడు నీక్కావలసినవన్నీ నీ దగ్గరకే వస్తాయి. అప్పటికీ!!, నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోకపోతే.. పెళ్ళిచేసుకో.

గుర్తుంచుకో.. ఆ సినిమాలలో చూపించినట్లుగా, జీవితానికి లక్ష్యం ప్రేమమాత్రమే కాదు…”, అని రామ్ కి నచ్చచెప్పాడు మావయ్య..

అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ సెలవుపై ఇంటికి వచ్చిన రామ్ తన మావయ్యతో కబుర్లు చెబుతూ.. తన చదువుకునే రోజులు గుర్తొచ్చి నవ్వొచ్చింది… ఆ రోజు మావయ్య నాకు చెప్పకపోయుంటే.. తన లైఫ్ ఏమైపోయేదో.. అని ఆలోచిస్తూ తన చెంపపైకారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ.. మావయ్యకోసం తెచ్చిన వాచ్, ఐపోడ్ తో బాటుగా.. పెద్ద కవర్లో పేక్ చేసిన గిఫ్ట్ మావయ్య చేతికి అందించాడు.

“ఏమిట్రా.. ఇదీ!!”, అని ఆనందంతో అందుకుని ఆ గిఫ్ట్ ని విప్పసాగాడాయన.

సింధూరవర్ణంతో మిలమిల మెరిసిపోయే సూర్యుడి చిత్రపటం అది… ,కుడివైపు దిగువన ఏవో చిన్న అక్షరాలతో వ్రాసి ఉంది.. , మావయ్య కళ్ళజోడు సరిచేసుకుంటూ.. చదివాడు ఆ పదాల్ని.

“నా జీవితానికి వెలుగునింపి, దారి చూపించిన మావయ్యకి ప్రేమతో… రామ్.. “,అని వ్రాసి వుంది.

ఆచార్యదేవోభవ….
ఏమైనా ఆ రోజులు ఆరోజులే మళ్ళీ తిరిగిరావు. చిన్నప్పటి చదువుకునే రోజులు. మాది చిన్నపల్లెటూరు, మా ఊరికి నాలుగు కిలోమీటర్లదూరంలో స్కూలు. ప్రతిరోజు రిక్షాలో వెళ్ళెవాళ్ళం. సన్నని రోడ్డు, చుట్టూ పంటపొలాలు, ఆ చక్కటి దృశ్యాలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయి. పాటలుపాడుతూ కేరింతలు కొడుతూ అల్లరితో బయలుదేరేవాళ్ళం. కాగితాలను చిన్నముక్కలుగా చించి, చల్లని పైరగాలికి ఎగరవేయడం. గాలి పంకాలు చేసి తిరుగుతుంటే, ఎవరిది వేగంగా తిరుగుతుందో పోటీపడటం. ఇవి చిన్న ఆనందాలే కావచ్చు, ఆ వయసుకు అవే ఎంతో గొప్ప ఆనందాలు.

టైముకి చేరుకోకపోతే గోడకూర్చీయో, స్కూలు బయట నిలబడడమో తప్పేది కాదు. లేటుమాది కాకపోయినా శిక్ష తప్పదు, కాని అదే సరదాగా ఉండేది. క్లాసు ఎగ్గొట్టడానికి ఒక్కొక్కసారి..రోజూ ఉదయాన్నేరెండు గంటలపాటు, స్కూలుముందున్న ఖాళీ స్ఠలంలో ప్రార్ధనతో మెదలయ్యేది దినచర్య. అదీ ఎండలో, చెమటలు కక్కుతూ, వేడిమి తట్టుకోలేక కళ్ళుతేలేసే వారు కొందరైతే, ఆస్కార్ అవార్డ్ కోసంకాకపోయినా, ప్రార్ధన బారినుండి తప్పించుకోవడానికి కొందరు, పడ్డవాళ్ళని తీసుకెళ్ళే వంకతో కొందరు క్లాసురూమ్లలోకి వెళ్లిపోయేవారు.ఇక గురువారం వస్తే, అందరూ తెల్లబట్టలు వేసుకుని రావాలి. షూ, సాక్స్ తో సహా అన్నీ తెలుపే. వారానికి ఒకసారే కాబట్టి స్కూలుమెత్తం మిలమిలమెరిసేది. సాయంత్రం కాగానే ఎర్రగా మారేవి మా బట్టలతో పాటు మెహాలు కూడా.., ఆటలతో బట్టలు మాసిపోయాయని అమ్మ తిట్టిన తిట్లకు.

ఐదో తరగతి వరకూ కొన్ని సబ్జక్ట్స్ లో అప్పుడప్పుడూ ఫస్ట్ వచ్చేవాడిని. చిన్న చిన్న ప్రైజులు కూడా వచ్చేవి, క్లాసుకి రెగ్యులర్ అని, ఇంగ్లీషులో ఫస్ట్ అని ఇలా.. మరి ఏమైందో తెలియదు కాని ఒక్కసారిగా చదువులో చురుకుతనం సన్నగిల్లింది. రాని సబ్జక్ట్ పై భయం మొదలయ్యింది. లెక్కల సబ్జక్ట్ అంటే చచ్చేంత భయం పట్టుకుంది. ఆ మాష్టారు  పెద్ద పెద్ద కళ్ళతో దెయ్యంలా కనపడేవారు. ఇంటి దగ్గర ఎంత చదివినా, బాగా  చేసినా ఆయన్ను చూడగానే అన్నీ హుష్ కాకి. మరి ఏంటో ఆయన్లో ఏముందో. నన్నే ప్రత్యేకంగా బోర్డుపై లెక్కచేయమనేవారు. మనిషి కాస్త తెల్లగా, సరిపడ ఎత్తు, కోరపళ్ళు, గుబురుమీసాలు, కాస్త గూనిగా వంగి ఉన్నట్లు ఉండేవారు. ప్రత్యేకంగా చెక్కించిన వెదురు బెత్తంతో దిగేవారు క్లాసులోకి. ఆయన క్లాసు వున్నన్ని రోజులూ నాకు యమగండంలా ఉండేది., దెబ్బలు తప్పేవి కావు. ఆ ఉదయం నిద్రలోంచి ఆయనచేత  దెబ్బలు తింటున్నట్లు ఉలిక్కిపడి లేచేవాడిని.బోర్డుపైన ఏ లెక్క ఇచ్చేవారో తెలిసేది కాదు. ఆయన చేతిలో చాక్ పీస్ తీసుకోగానే ఏక్సన్ అన్నట్లుగా నా బుర్ర పనిచేయడం మానేసేది. ఒక్కోసారి అయిదు అయిదులులాంటి చిన్నలెక్క కి కూడా ఆలోచించాల్సి వచ్చేది . రెండు అయిదులు పది, మూడు అయిదులు…ఆగిపోయేది..ఆయన కొట్టేదెబ్బకోసం. హమ్మయ్య ఒకటైపోయింది,  ఇప్పుడు ఇంకొకటి పడబోతుంది, మళ్ళీ ఇంకొకటి.. ఇలా  తరువాత కొట్టబోయే దెబ్బ ఎక్కడ పడబోతుందో లాంటి పరిజ్ఞానం పెరిగి , దెబ్బలు అలవాటైపోయాయి.  తరువాత తోటి స్నేహితుల ఓదార్పులు, భయాలు, వాళ్ళ వరుసక్రమం కోసం చూసే బెదురుచూపులు మామూలే రోజూ.అలా ఎప్పుడూ ఒకరేకాకపోయినా మారిన ప్రతి మాష్టార్లతో నాకు తిప్పలు, దెబ్బలు తప్పేవికావు.  ఒకాయన మా నాన్నగారికి బాగా తెలుసట, మావాడిని కాస్త జాగ్రత్తగా చూడండి అని చెప్పినందుకుగానూ  అందరికన్నా రెండు దెబ్బలు ఎక్కువ పడేవి నా ప్రాణానికి. కానీ ఆయన మాములుగా కొట్టేవారుకాదు, కాలర్ పట్టుకుని పైకెత్తి చెంపమీద మాత్రమే కొట్టేవారు. మా స్కూలు మేడపైన ఉన్న క్లాసురూములు  కొన్ని తాటాకు పాకలు  ఉండేవి. సరిగా చదవనివాళ్ళు గబ్బిళాల్లా  పాక దూలాలకు వేళాడేవారు.  కాలర్ పట్టుకుని ఎక్కించేసి వదిలేసేవారు ఆయన. పాపం ఏడుస్తూ ఒక అరగంట వేళాడేవాళ్ళు. నేను వేళాడినట్లు గుర్తులేదుకానీ, ఒకమ్మాయైతే రోజులో సగం వేళాడుతూ ఉండేది. పోనీ ఇది చిన్నప్పుడు అనుకుందాం, తొమ్మిదో తరగతిలో వేరే మాష్టారుతో కూడా తప్పలేదు నాకు. స్కూలుకు ఒకచోట వెడల్పాటి చెక్కలతో గ్రిల్స్ ఉండేవి. అందులోంచి మంచి చెక్కనొకదానిని తెచ్చేవారు కొట్టడానికి. చేతికి తగిలి ..అంతలావు చెక్కకూడా విరిగిపోయేది. ఆ చేయికి ఒక నాలుగురోజుల వరకూ  స్పర్శ తేలిసేది కాదు, అయినా మా చదువులో మార్పురాలేదు.మిగతా సబ్జక్ట్స్ లో అంత దిట్ట కాకపోయినా  దెబ్బలు తినేవాడిని కాదు. తెలుగు పద్యం చదివి కంఠస్తపట్టడంలో మనకు మంచి పేరుండేది. ఒత్తులు ఉచ్చారణ, వ్రాయటంలో తెలుగుటీచరు నుండి మంచి మెప్పు, ప్రోత్సాహం ఉండేది.  కాని నా చేతివ్రాత ఒకటి బాగుండేది కాదు. చిన్నప్పటి నుండి పెయిటింగ్సు, డ్రాయింగ్సు వేయడం ఇష్టం, మంచి పేరుండేది కూడానూ.  అవి చూసి మా తెలుగుటీచరు నన్ను ఆటపట్టించేవారు. డ్రాయింగ్ చేసేవాళ్ళ చేతివ్రాత కూడా బాగుంటుంది, కాని నీ చేతివ్రాత ఛంఢాలం అని అనేవారు. తెలుగు కాపీ రైటింగు లు ఎన్ని వ్రాసినా లాభంలేకపోయింది.ఇక హిందీ, నాకు బాగానే వచ్చు.  టీచర్ కి భయపడైనా చదవటం, వ్రాయటం బాగానే నేర్చుకున్నా. సొంతంగా ఊహంచి వ్రాయలేకపోయినా, బట్టీకొట్టయినా మంచి మార్కులు తెచ్చుకునేవాడిని. హిందీ కాపీరైటింగు వ్రాయటం ప్రతిరోజూ చాలా పెద్దపని. నాకు బాగా గుర్తు. ఒకరోజు కాపీరైటింగు వ్రాయలేదు . కానీ టీచర్ రాకముందే బల్లమీద పుస్తకాలు పెట్టుంచాలి. వ్రాయని వాళ్ళు  బయటకు వెళ్ళి నిలబడాలి ,అది రూలు. ఎవరూ తప్పేవాళ్ళుకాదు. మా హిందీ టీచరు అంటే అంత భయం అందరికీ. ఆవిడరాగానే బయట నిలబడి ఉన్నవాళ్ళని కోపంగాచూసి, రెండు మూడు తిట్లు తిట్టాకే   పాఠం మెదలుపెట్టేవారు. కాని నేను ఎందుకో వ్రాయలేదు. బయటకు వెళ్ళలేదు కూడానూ. మరి అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. ఆ రోజు నా టైము బాగాలేక,  ఒకమ్మాయిని పిలిచి బల్లపై ఉన్నపుస్తకాల లెక్కసరిగా ఉన్నాయోలేదో చూడమని చెప్పారు. మధ్యలో ఒక వార్నింగు కూడా ఇచ్చారు. వ్రాయని వాళ్ళు ఇంకా వుంటే బయటకు వెళ్ళిపొండి, నేనేమీ అననని. ఇద్దరు లేచివెళ్ళిపోయారు. నేనే అనుకున్నా ఇంకా తోడుదొంగలున్నారన్నమాట అనిపించింది. నేను లేవలేదు. వాళ్ళను ఏమీఅననన్నారుకానీ అవమానాలు తప్పలేదు పాపంవాళ్ళకి. రెండు, మూడు సార్లు అయ్యింది వార్నింగు ఇవ్వడం. కాళ్ళదగ్గరనుండి మెదలయ్యింది ఒణుకు నాకు, ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మెదటి వార్నింగుకే లేవవలసింది అనిపించింది. టెన్సన్ తో మెహం ఎర్రగా కందిపోయింది. టీచర్ నా వంక చూస్తే చాలు పుస్తకాల లెక్కకూడా అవసరంలేకుండా నేను వ్రాయలేదని చెప్పోచ్చు, అంతలా ఒణుకుతున్నా.  పుస్తకాలూ, కుర్చున్నవాళ్ళనూ లెక్కపెట్టడం అయిపోయింది..  సరిపోయాయ్ టీచర్ అని చెప్పింది ఆ అమ్మాయి.  లెక్కపొరపాటు కానేకాదు, ఆ అమ్మాయి చాలా ఇంటలిజెంట్, నేననుకోవటం ఎంటంటే లెక్క తక్కువొచ్చినా సరిపోయిందని చెప్పుండొచ్చు. ఏదేతేనేమి ఆ అమ్మాయి సాయం మరిచిపోలేనిది,  బ్రతికి తప్పించుకున్నా.  నేను తరువాత ఎప్పుడూ కూడా అంత టెన్సన్ అనుభవించలేదు, ఆఖరికి ఇంటర్వూలో, జాబ్ లేకపోయినపుడు, సెలక్సన్ రిజల్ట్స్ వచ్చినప్పుడూ  కూడా.  ఆ వయసులో అదే పెద్ద టెన్సన్ పడే సమస్య మరి.మా ఇంగ్లీష్ మాష్టారు కేరళనుండి వచ్చారు. తెలుగు అసలు వచ్చేది కాదు ఆయనకి.  చాలా పొడవుగా ఉండేవారు. మాములుగా నిలబడి చేయిచాచి ఉంచితే ఆయన పొడవైన వేళ్ళమధ్య సరిపడమెడ అంత హైటులో ఉండేవాళ్ళంమేము. ఏదైనా సరిగ్గా చెప్పకపోతే మెడచుట్టూ చెతితో పట్టుకుని, ముందుకూ, వెనకకూ ఊపుతూ ఇంగ్లీషులో ఉన్న తిట్లన్నీ వరుసపెట్టి  తిట్టేవారు. తిట్టడం అవగానె చెయ్యి వదిలేసేవారు, అంతే మోకాళ్ళు కొట్టుకుపోయేలా అంత దూరానా  క్రింద పడేవాళ్ళం. ఇక సేడిస్టు పనులు చేసే సోషల్ టీచర్ ఒకరుండేవారు.  ఆయనదీ కెరళనే. సూదుళ్ళా ఉండే డ్రాయింగు పరికరాలతో  గుచ్చడానికి తీసి బెదిరించడం, మనిషిని ఒంగోమని ..వాడిపై  కూర్చుని ..ఏడి వీడు .. ఎక్కడికి పోయాడు అని వెదుకుతూ కామెడీ చేయటం, బరువైన బ్యాగ్ ను మెడలో వేసుకోమని..  హార్మోనియంలా వాయిస్తూ క్లాసులో తిరగమని బెదరించడం.  టేబుల్ క్రిందనుండి  ప్రాక్కుంటూ రమ్మని చెప్పి…కర్రకు అందగానే.. వీపుపై  ఒక్కటివ్వడం..  , నేను ఎప్పుడూ ఆయనకు దొరకలేదు . అమ్మో..  ఆయన పిచ్చి చేష్టలతో హడలిపోయేది క్లాసంతా.. ఒక్కడు నవ్వేవాడు కాదు.   కాని ఇప్పుటికీ మా  ఫ్రెండ్స్ ని కలిసి నప్పుడు  ఆ సన్నివేశాలు గుర్తొచ్చి పగలబడి నవ్వుకుంటాం.ఇక సంస్కృతం మాష్టారు గురించి చెప్పాలి. ఆయన చెప్పిన పాఠాలు, ఇచ్చిన ప్రోత్సాహం.. చాలా ఉపయోగపడేవి. చదువును ఏవిధంగా చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. పిల్లలకు బోర్ కొడుతుందనగానే టాపిక్ మార్చి ఎక్కడికో తీసుకెళ్ళేవారు.  ప్రత్యేకంగా శోభన్ బాబులా మిమిక్రీ చేస్తూ ఆయన చెప్పే జోకులకి భలే నవ్వుకునేవాళ్ళం. ఆయనంటే పిల్లలందరికీ ఎంతో అభిమానం, ఎందరికోలాగా నాక్కూడా ఫేవరట్ టీచర్ ఆయన. అందులోనూ సంస్కృత పాఠాలన్నీ పురాణకధలేమో, అవి జనరల్ గా మన సినిమా కధలలాగా చెప్పి బుర్రలోకి ఎక్కించేవారు. ఒక్కసారి క్లాసు వింటే.. ఇక సొంతవాక్యాలతో పరీక్షలో వ్రాయటమే, బట్టీకొట్టేపనే ఉండేది కాదు.నిజంగా ఈ ఉపాద్యాయులు, వాళ్ళ కాఠిన్యంతోనైనా, మంచితనంతోనైనా, వాళ్ళు చెప్పన మంచిమాటలు, ఇచ్చిన ప్రోత్సాహం ఇవన్నీ ఇప్పుడు ప్రతి నిముషం మనకు ఉపయోగపడుతున్నాయి. తెలుగు టీచరు అలా ఆ రోజు మా చేత చదివించి ఉండకపోయుంటే, నా మనసులో ఉన్నది నేను ఇలా పేపరుపై పెట్టి మీతో పంచుకోగలిగేవాడినా?. హిందీ టీచరు కఠినంగా ఉండకపోయుంటే, నాకు  హిందీ చదవడం, వ్రాయడం రాక ఎంత ఇబ్బంది పడేవాడినో . ఎవరి భోధనా పద్దతులు వాళ్ళవైనా, వాళ్ళ చదువు అనే దీపాలతో మన జీవిత దీపాల్ని వెలిగించిన వాళ్ళకి ఏమిస్తే ఋణం తీరుతుంది చెప్పండి.  తల్లిదండ్రుల తరువాత అంతటి వాళ్ళకు ఏమిచ్చినా తక్కువే.కానీ ఒక్కటి నిజం, వాళ్ళని సంతోష పెట్టేది గురుదక్షిణ కాకపోయినా, మనం ఒక మంచి విజయాన్ని సాధించినపుడు మనం వాళ్ళను కలిసి ఆ ఆనందాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళకళ్ళలో కి చేరిన ఆనందం కంటే మించిన గురుదక్షిణ ఏదీ మనం ఇవ్వలేం…ఆచార్యదేవోభవ….

చినుకు
చినుకు చినుకు చినుకులో.. ఎన్నివేళ చినుకులో..

తళుకు తళుకు మెరుపులో.. వజ్రమంటి తునకలో..

గగనతలమునుండి రాలి…

పుడమితల్లి ఎదను తాకి…

స్వాతిముత్యమల్లె మారి…

చిలిపి నవ్వులో..

వాన చినుకులో..

నేలపరిమళాల నీటిపువ్వులో..

పరవశానపొంగే చిన్ని గువ్వలో..

కళ్ళలో తారలై ఈ సందేవేళలో..

ఇష్టమైన ఇసుకఇంటి గూటిలోన సూదిగుచ్చె చినుకులంటే కోపముందిలే

తనువుపైన మత్తుజల్లి తాపమంత ఎదనురేపు జల్లులిపుడు ఇష్టమాయలే

కాగితాల పడవతోటి నీటిబుడగలన్ని పేల్చి మరువలేని కేరింతలే

నేలపైన చెవినిఆన్చి చినుకు చేయు సవ్వడుల్ని విన్నక్షణము తీపిగురుతులే

నా చిన్ననటి జ్ఞపకాలు ఒక్కసారె నన్నుదోచి వయసుమరచి చేయతోచెలే

చినుకు చినుకు చినుకులో..

చల్లగాలితోటి వచ్చి నింగివైపు చూడనీని వర్షమంటె చిన్నచూపులే

మనసులోన దాగివున్న ఆశకేమొ రెక్కలొచ్చి రివ్వుమంటు ఎగురుతుందిలే

బాధలోన నవ్వులోన కనులవెంట చుక్కలోన భేదమిపుడులేనెలేదులే

కళ్ళలోన కడలినుండి బాధలన్ని నవ్వులయ్యి చిలిపిజల్లులీవానలే

నా చిన్ననటి జ్ఞపకాలు ఒక్కసారె నన్నుదోచి వయసుమరచి చేయతోచెలే

చినుకు చినుకు చినుకులో..